తిరుమల శ్రీవారి భక్తుల విజ్ఞప్తి మేరకు అంగ ప్రదక్షిణ టోకెన్ల జారీ విధానంలో మార్పులు చేసినట్లు ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన ఆన్‌లైన్ కోటా విడుదల చేయనున్నారు. నవంబరు 17 నుంచి 25 వరకు తిరుచానూరులో కార్తిక బ్రహ్మోత్సవాలు, డిసెంబర్ 30 నుంచి 2026 జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నట్లు వెల్లడించారు.