TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తర్వాత రాష్ట్ర మంత్రివర్గంలో కీలక మార్పులు జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మినహా మంత్రులందరి శాఖలు మార్చేలా అధిష్టానం ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఉప ఎన్నిక తర్వాత కేబినెట్ మార్పులు ప్రకటించే అవకాశం ఉన్నట్లు వినిపిస్తోంది. అయితే అధిష్టానం సూచించిన మంత్రివర్గ మార్పుపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.