ఈ ఏడాది చార్‌ధామ్ యాత్రలో 51 లక్షల మందికిపైగా భక్తులు పాల్గొన్నారు. అత్యధికంగా 17.68 లక్షల మంది కేదార్‌నాథ్‌ను సందర్శించారు. బద్రీనాథ్ (16.60 లక్షలు), గంగోత్రి (7.58 లక్షలు), యమునోత్రి (6.44 లక్షలు) మిగతా స్థానాల్లో నిలిచాయి. మంగళవారం బద్రీనాథ్ ఆలయ ద్వారాల మూసివేతతో ఈ ఏడాది యాత్రకు ముగింపు పలికినట్లయ్యింది. అధిక వర్షపాతం, వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి విపత్తులు ఎదురైనప్పటికీ, 51 లక్షల మందికిపైగా యాత్రికులు సందర్శించారు.