బీసీ బిల్లు కోసం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేపట్టబోయే 72 గంటల నిరాహార దీక్షకు మద్దతుగా జిల్లా కేంద్రాలకు బీసీ చైతన్య రథాలు బయల్దేరాయి. కవిత గురువారం జెండా ఊపి చైతన్య రథాలను ప్రారంభించారు. బీసీలకు స్థానిక
ఎన్నికలు, విద్య, ఉద్యోగ రంగాల్లో 42% రిజర్వేషన్ల సాధన కోసం 72 గంటలపాటు ఆగస్టు 4, 5, 6 తేదీల్లో ఎమ్మెల్సీ కవిత ఇందిరాపార్క్‌లోని ధర్నా చౌక్ వద్ద నిరాహార దీక్ష చేపట్టనున్నారు.