
ఎన్టీఆర్ వ్యక్తిత్వ హక్కుల కేసు.. నేడు ఢిల్లీ హైకోర్టులో విచారణ
తన అనుమతి లేకుండా తన ఫోటోలు, పేర్లు, వీడియోలను సోషల్ మీడియా, ఈ-కామర్స్ సైట్లలో పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నారని ఆరోపిస్తూ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై జస్టిస్ జ్యోతి సింగ్ ధర్మాసనం నేడు విచారణ చేపట్టనుంది. వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోరుతూ ఎన్టీఆర్ ఈ చర్య తీసుకున్నారు.




