రేవంత్‌ రెడ్డిపై చీటింగ్‌ కేసు పెట్టాలి: మాజీ ఎమ్మెల్యే

4542చూసినవారు
రేవంత్‌ రెడ్డిపై చీటింగ్‌ కేసు పెట్టాలి: మాజీ ఎమ్మెల్యే
రైతుభరోసా పేరుతో రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌ రెడ్డి నిండా మోసం చేశారని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మండిపడ్డారు. వరంగల్ వేదికగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇచ్చిన మాటను తప్పారన్నారు. సీఎం రేవంత్‌కు నైతిక విలువలు ఉంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 70 లక్షల మంది రైతులను మోసం చేశారని అన్నారు. సోమవారం తెలంగాణ వ్యాప్తంగా అన్ని పీఎస్‌లలో ఫిర్యాదు చేస్తామని అన్నారు. రేవంత్‌ రెడ్డిపై చీటింగ్‌ కేసు పెట్టాలని అన్నారు.

సంబంధిత పోస్ట్