TG: కామారెడ్డి (D), ఎల్లారెడ్డి (M) సబ్దల్ పూర్ గ్రామంలో గురువారం విషాదం చోటుచేసుకుంది. ప్రియుడు మోసం చేశాడని ఓ యువతి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సావిత్రి(19) అనే యువతి సూసైడ్ నోట్ రాసి నైలాన్ తాడుతో ఫ్యాన్ కు ఉరి వేసుకుని చనిపోయింది. 'ప్రదీప్ అనే యువకుడితో తనకు ప్రేమ వ్యవహారం ఉందని, కానీ ప్రదీప్ తనను మోసం చేశాడని' సూసైడ్ నోట్ లో పేర్కొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.