మన చుట్టూ ప్రకృతిలో ఎన్నో రకాల మొక్కలు పెరుగుతుంటాయి. వాటిల్లో ఔషధ గుణాలు ఉండే మొక్కలు కూడా చాలానే ఉన్నాయి. అలాంటి మొక్కల్లో నల్లేరు కూడా ఒకటి. నల్లేరు కాడలను ఆహారంలో భాగం చేసుకుంటే ఎముకలకు ఎంతో మేలు జరుగుతుంది. ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే గుండెపోటు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా నివారిస్తోంది. స్త్రీలు రుతు సమయంలో వీటిని తింటే తీవ్ర రక్తస్రావం నుంచి బయట పడవచ్చు.