
రాజకీయ వైరలు పక్కనపెట్టి అదరగొట్టారు !
పవన్ కళ్యాణ్, ప్రకాశ్ రాజ్ లు కలిసి నటించిన 'ఓజీ' చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్ గా దూసుకుపోతోంది. వీరి మధ్య రాజకీయ విభేదాలు, విమర్శలు అందరికీ తెలిసిందే. అయినప్పటికీ 'ఓజీ' సినిమాలో కీలక పాత్రలు పోషించి అదరగొట్టారు. పవన్ కళ్యాణ్ ప్రకాశ్ రాజ్ ను 'బ్రిలియంట్ యాక్టర్' అని ప్రశంసిస్తూ తమ రాజకీయ అభిప్రాయాలు వేరైనా, సినిమా సెట్ లో వృత్తిపరంగానే వ్యవహరించామని అన్నారు. ప్రకాష్ రాజ్ కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తేలిపారు.




