
టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన పనిలేదు.. NHAI కొత్త విధానం
భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) హైవేలలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. ఇకపై టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఆగాల్సిన అవసరం లేకుండా ‘మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో’ టోలింగ్ విధానాన్ని ప్రవేశపెట్టనుంది. ఫాస్టాగ్, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ టెక్నాలజీతో వాహనాలు వెళ్తుండగానే టోల్ ఆటోమేటిక్గా కట్ అవుతుంది. గుజరాత్ NH-48పై ఈ విధానం విజయవంతమైంది. అలాగే, AI-MC సాంకేతికతతో నాణ్యమైన రోడ్ల నిర్మాణం, డ్రిప్ ఇరిగేషన్, వర్షపు నీటి నిల్వలతో పర్యావరణ పరిరక్షణ చేపట్టనున్నారు.




