TG: ఫీజు బకాయిల పేరుతో హాల్‌టికెట్లు ఇవ్వమనే బెదిరింపులకు చెక్ పెట్టేలా కొత్త విధానం అమల్లోకి వస్తోంది. పదో తరగతి, ఇంటర్ విద్యార్థులు ఇకపై స్కూల్ లేదా కాలేజీకి వెళ్లకుండానే మొబైల్ ఫోన్‌లోనే హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటికే ఎస్‌ఎస్‌సీ బోర్డు, ఓపెన్ స్కూల్ బోర్డు ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించాయి. మార్చి 14 నుంచి పదో తరగతి పరీక్షల హాల్‌టికెట్లు ఫోన్‌లో అందుబాటులోకి రానున్నాయి. ఇంటర్ పరీక్షలకూ ఇదే విధానాన్ని తీసుకురావడానికి ఇంటర్‌బోర్డు మీసేవ అధికారులతో చర్చలు జరుపుతోంది.