బహిరంగ మూత్ర విసర్జనకు చెక్.. మైసూర్‌లో వినూత్న ప్రయోగం!

4చూసినవారు
మైసూరు నగరపాలక సంస్థ అధికారులు బహిరంగ మూత్రవిసర్జనను అరికట్టేందుకు వినూత్న ప్రయోగం చేపట్టారు. నగరంలోని ప్రధాన వీధులు, గోడల మూలల్లో అద్దాలను అమర్చారు. దీనివల్ల ప్రజలు తమ ప్రతిబింబాన్ని చూసుకుని సిగ్గుతో బహిరంగ ప్రదేశాల్లో మూత్రవిసర్జన చేయకుండా ఉంటారని అధికారులు భావిస్తున్నారు. గోడలపై పారిశుద్ధ్య సందేశాలు, పబ్లిక్ టాయిలెట్ల వివరాలతో కూడిన బోర్డులను కూడా ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్