‘మైక్రో మెడిటేషన్‌’తో ఒత్తిడికి చెక్‌!

12410చూసినవారు
‘మైక్రో మెడిటేషన్‌’తో ఒత్తిడికి చెక్‌!
కాలం వేగంగా మారుతున్న తరుణంలో, జీవనశైలీ మార్పులతో ఒత్తిడి, ఆందోళన పెరుగుతున్నాయి. దీన్ని తగ్గించేందుకు సుదీర్ఘ ధ్యానం చేయడానికి సమయం లేని వారికి ‘మైక్రో మెడిటేషన్‌’ కొత్త పరిష్కారంగా మారిందని నిపుణులు చెప్తున్నారు. ఈ విధానంలో 30 సెకన్ల నుంచి 5 నిమిషాల వరకే ధ్యానం చేస్తారు. నడక మధ్యలో, ఆఫీస్‌లో బ్రేక్‌లో, భోజనానికి ముందు కాసేపు శ్వాసపై దృష్టి పెట్టడం ద్వారా మెదడు ప్రశాంతమవుతుంది. స్ట్రెస్‌ హార్మోన్లు తగ్గి, ఫోకస్‌ పెరుగుతుందని అంటున్నారు.

సంబంధిత పోస్ట్