తమలపాకుతో ఈ సమస్యలకు చెక్

14965చూసినవారు
తమలపాకుతో ఈ సమస్యలకు చెక్
తమలపాకులతో అనేక రకాల ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  ఇందులో కాల్షియం, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు, జీర్ణక్రియకు సహాయపడతాయి. అలాగే నోటి దుర్వాసనతో ఇబ్బంది పడేవారు తమలపాకును నమలడం వల్ల మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు. అలాగే జలుబు, దగ్గు, నోటి పూత లాంటి సమస్యలను కూడా తమలపాకు నివారిస్తుందట.