TG: హైదరాబాద్ మణికొండలో చెడ్డీ గ్యాంగ్ బీభత్సం సృష్టించింది. నెక్నాంపూర్ ఫ్లోటిల్లా అపార్ట్‌మెంట్స్‌లో తెల్లవారుజామున చోరీకి పాల్పడ్డారు. అపార్ట్మెంట్ వెనుక ఉన్న కంచెను కత్తిరించి లోపలికి వచ్చినట్లు తెలుస్తోంది. మెట్ల మార్గం ద్వారా సి-బ్లాక్‌లోకి ప్రవేశించి ఓ ఫ్లాట్‌లో నుంచి నగదు, 5 వాచీలు అపహరించారు. అనుమానితుల కదలికలను అపార్ట్మెంట్ నివాసి ఒకరు గమనించినట్లు సమాచారం. ఈ ఘటనపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీని స్వాధీనం చేసుకుని అనుమానితుల కోసం గాలిస్తున్నారు.