ఉత్తరాఖండ్‌లోని శ్రీకోట్ గ్రామంలో ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న చిరుత ఎట్టకేలకు చిక్కింది. చిరుతపులి దాడిలో ఇటీవల ఓ బాలిక మరణించింది. దీంతో అటవీశాఖ అధికారులు బోనులు, డ్రోన్లు, ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. తాజాగా చిరుత బోనులో చిక్కుకోవడాన్ని స్థానికులు గమనించి అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అటవీ సిబ్బంది చేరుకొని చిరుత పులిని అక్కడి నుంచి తీసుకెళ్లారు.