IPL-2026లో భాగంగా చెన్నై వేదికగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచులో CSK బ్యాటర్లు తడబడ్డారు. దీంతో CSK నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 158 పరుగులు మాత్రమే చేసింది. రుతురాజ్ గైక్వాడ్(74) ఒక్కడే కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడారు. మిగతా బ్యాటర్లు అందరూ తక్కువ స్కోరుకే ఔటయ్యారు. కగిసో రబడ 3, అర్షద్ ఖాన్ 2 కీలక వికెట్లు తీసి చెన్నై పతనాన్ని శాసించారు.