చేవెళ్ల యాక్సిడెంట్.. అనాథలైన ఇద్దరు చిన్నారులు

46చూసినవారు
చేవెళ్ల యాక్సిడెంట్.. అనాథలైన ఇద్దరు చిన్నారులు
TG: చేవెళ్ల వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదం హృదయ విదారక దృశ్యాలను మిగిల్చింది. ఈ ప్రమాదంలో వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం హాజీపూర్‌కు చెందిన దంపతులు బందప్ప, లక్ష్మి దుర్మరణం పాలయ్యారు. వారిద్దరి మృతి కారణంగా వారి కూతుర్లు భవానీ, శివలీల అనాథలుగా మిగిలిపోయారు. కుటుంబాన్ని కోల్పోయిన ఈ పిల్లల పరిస్థితి స్థానికులను కన్నీళ్లు పెట్టిస్తోంది. ప్రమాదంపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్