TG: చేవెళ్లమండలం మీర్జాగూడ వద్ద సోమవారం జరిగిన బస్సు ప్రమాదం పలు కుటుంబాల్లో చీకట్లు నింపింది. ఈ నేపథ్యంలో తాండూరు పట్టణంలోని విలేమోన్ చౌరస్తాలో మంగళవారం స్థానిక ప్రజలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. రోడ్ల పరిస్థితి అద్వాన్నంగా ఉందని ఆందోళన చేపట్టారు. తాండూరు రోడ్లను తక్షణమే బాగు చేయాలని, తమ సమస్యలు పరిష్కరించడానికి కలెక్టర్ రావాలంటూ ప్రజలు డిమాండ్ చేశారు.