
ఘోర ప్రమాదం.. 30 అడుగుల దూరంలో ఎగిరిపడ్డాడు(వీడియో)
యూపీలోని మహారాజ్ గంజ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన నీళ్లు పడుతున్న యువకుడిని వేగంగా దూసుకొచ్చిన ఓ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో యువకుడు 30 అడుగుల దూరంలో ఎగిరిపడ్డాడు. తీవ్రంగా గాయపడిన ఆ యువకుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటన ఈ నెల 3న జరగగా తాజాగా సీసీటీవీ విజువల్స్ వైరలవుతున్నాయి. ఈ ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం.




