ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


కులాంతర వివాహానికి ఒప్పుకోలేదని.. యువ వైద్యుడి ఆత్మహత్య
Jul 07, 2026, 01:07 IST/

కులాంతర వివాహానికి ఒప్పుకోలేదని.. యువ వైద్యుడి ఆత్మహత్య

Jul 07, 2026, 01:07 IST
ఢిల్లీలోని అరుణా ఆసఫ్ అలీ ఆస్పత్రిలో సీనియర్ రెసిడెంట్ వైద్యుడు డాక్టర్ సిమర్‌ప్రీత్ సింగ్ ఆనంద్ (35) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మూడు పేజీల సూసైడ్ నోట్ లభించడంతో పోలీసులు ప్రాథమికంగా ఆత్మహత్యగా నిర్ధారించారు. తనతో పనిచేస్తున్న మహిళా డాక్టర్‌ను ప్రేమించానని, కులాంతర వివాహానికి ఇరువైపుల కుటుంబసభ్యులు నిరాకరించడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు నోట్‌లో పేర్కొన్నారు. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి, ఫోరెన్సిక్ ఆధారాలు సేకరించి, కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.