
స్పెల్లింగ్ మిస్టేక్స్తో చెక్కు రాసిచ్చిన ప్రభుత్వ టీచర్ సస్పెండ్
హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వ సీనియర్ సెకెండరీ స్కూల్లో టీచర్ అట్టర్ సింగ్ రాసిన చెక్‌లో చాలా ఎక్కువగా ఇంగ్లిష్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్న ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై అక్కడి విద్యాశాఖ తీవ్రంగా స్పందించింది. రూ.7,616 చెక్‌లో “Seven”ను “saven”, “Hundred”ను “Harendra”, “Six”ను “Sixty” అని తప్పుగా రాసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బ్యాంక్ చెక్ తిరస్కరించగా, దీనిని పరిశీలించిన డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ టీచర్‌పై సస్పెన్షన్ విధించింది.




