రాజస్థాన్ కోటాలో జరిగిన అగ్నిప్రమాదంలో బాలనటుడు వీర్ శర్మ (10) మృతి చెందాడు. ఈ ప్రమాదంలో అతడి సోదరుడు శౌర్య (15) కూడా ప్రాణాలు కోల్పోయాడు. 'వీర్ హనుమాన్' సీరియల్లో వీర్ శర్మ లక్ష్మణుడి పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సైఫ్ అలీ ఖాన్ నెక్స్ట్ సినిమాలో చిన్ననాటి రోల్ పోషిస్తున్నాడు. ఇంట్లో నిద్రిస్తుండగా అగ్నిప్రమాదం జరిగి పొగకు ఊపిరాడక చనిపోయారని పోలీసులు తెలిపారు. మృతుల తల్లి రీటా శర్మ బాలీవుడ్ నటి అని, ఆ సమయంలో పేరెంట్స్ ఇంట్లో లేరని చెప్పారు.