బెలూన్‌ గొంతులో ఇరుక్కొని చిన్నారి మృతి

16చూసినవారు
బెలూన్‌ గొంతులో ఇరుక్కొని చిన్నారి మృతి
AP: గుంటూరు జిల్లా పెదకాకానిలో విషాద ఘటన చోటుచేసుకుంది. నాలుగేళ్ల శిరీష అనే చిన్నారి బెలూన్‌తో ఆడుకుంటుండగా అది గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో అపస్మారక స్థితికి చేరుకున్న చిన్నారిని కుటుంబ సభ్యులు వెంటనే గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. అయితే అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తె ఇలా మృతి చెందడంతో తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్