వేడి పాలల్లో పడి చిన్నారి మృతి (వీడియో)

9చూసినవారు
AP: వేడి వేడి పాలల్లో పడి 16 నెలల బాలిక మృతి చెందింది. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడు అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో గత శనివారం ఈ ఘటన జరిగింది. తీవ్ర గాయాలతో అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ బాలిక గురువారం తుది శ్వాస విడిచింది. ఆ సమయంలో అక్కడ పెద్ద వారు ఎవరూ లేకపోవడంతో ఈ ఘోరం జరిగిపోయింది. ఈ విషాద ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది.

సంబంధిత పోస్ట్