మీజిల్స్‌తో చిన్నారి మృతి.. న్యూయార్క్‌లో 30 ఏళ్లలో తొలి మరణం

6చూసినవారు
మీజిల్స్‌తో చిన్నారి మృతి.. న్యూయార్క్‌లో 30 ఏళ్లలో తొలి మరణం
అమెరికాలో మీజిల్స్‌ (తట్టు) వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. న్యూయార్క్‌లోని లూయిస్‌ కౌంటీలో మీజిల్స్‌ బారినపడిన చిన్నారి సోమవారం మరణించింది. గత 30 ఏళ్లలో రాష్ట్రంలో ఈ వ్యాధితో మరణం నమోదవడం ఇదే తొలిసారి. అక్టోబర్‌ 29 నాటికి దేశవ్యాప్తంగా 4,852 కేసులను సీడీసీ ధృవీకరించగా, న్యూయార్క్‌లో 178 కేసులు నమోదయ్యాయి. టీకా కార్యక్రమాలు, నివారణ చర్యలు బలోపేతం చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్