పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులకు చైల్డ్ సైకాలజిస్టుల సూచనలు

11821చూసినవారు
పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులకు చైల్డ్ సైకాలజిస్టుల సూచనలు
పిల్లలు పెద్దలకు గౌరవం ఇవ్వకపోవడం, అసభ్యకరమైన పదాలు మాట్లాడటం వంటి సమస్యలతో తల్లిదండ్రులు చైల్డ్ సైకాలజిస్టులను ఆశ్రయిస్తున్నారు. ఈ సమస్యలకు చాలావరకు తల్లిదండ్రులే పరిష్కారం చూపవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అతిథులతో ఎలా మాట్లాడాలో చిన్నప్పటి నుంచే నేర్పించాలి. పిల్లలు చూసే టీవీ, యూట్యూబ్ కార్యక్రమాలపై నిఘా ఉంచాలి. పిల్లలు అబద్ధాలు చెప్పడానికి కారణాలను అర్థం చేసుకుని, వారిని తిట్టకుండా మంచి చెడులను వివరించాలి. తల్లిదండ్రులు కూడా పిల్లల ముందు నిజాయితీగా ఉండటం ముఖ్యం.

ట్యాగ్స్ :