మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో కాఫ్ సిరప్ తాగిన పిల్లలు మరణించిన ఘటనపై సుప్రీంకోర్టు విచారణకు అంగీకరించింది. న్యాయవాది విశాల్ తివారీ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఉజ్వల్ భూయాన్, జస్టిస్ కే వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం, ఈ ఘటన తీవ్రత దృష్ట్యా అత్యవసర విచారణ అవసరమని పేర్కొంది. చిన్నారుల మృతిపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని, జాతీయ న్యాయ కమిషన్ లేదా నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని పిటిషనర్ కోరారు.