పిల్లల విక్రయాల కేసులో కీలక నిందితురాలు ప్రియాంక లొంగిపోయేందుకు సిద్ధమైంది. ఆమెను పట్టుకోవడానికి విజయవాడ నుంచి ప్రత్యేక బృందం దిల్లీ, మేరఠ్‌కు వెళ్లింది. పోలీసులు చేరుకునేలోపే ప్రియాంక ఉత్తరాఖండ్‌కు పారిపోయింది. అన్ని వైపులా దారులు మూసుకుపోవడంతో ఆమె లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ కేసులో దిల్లీ ముఠా కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.