కోల్డ్రిఫ్ దగ్గు మందు తాగి పిల్లలు చనిపోయిన కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కోల్డ్రిఫ్ దగ్గు మందు తయారీ కంపెనీకి అనుమతులిచ్చిన మధ్యప్రదేశ్ అధికారుల తీరు పలు అనుమానాలకు దారి తీస్తోంది. తమిళనాడుకు చెందిన సిరప్ కంపెనీ ‘శ్రీసన్’ నిబంధనలు పాటించలేదని తేలింది. అపరిశుభ్ర వాతావరణంలో మందులు తయారు చేసినట్లు దర్యాప్తు బృందం గుర్తించింది. అధికారులు తరచూ తనిఖీలు చేసి ఉంటే ఇంత ఘోరం జరగకపోయేదని వాదనలు వినిపిస్తున్నాయి.