అంగన్‌వాడీలో మేకలతో పిల్లలు భోజనం: విచారణకు ఆదేశం

109చూసినవారు
మధ్యప్రదేశ్‌లోని కట్నీ జిల్లాలో ఒక అంగన్‌వాడీ కేంద్రంలో పిల్లలతో పాటు మేకలు కూడా మధ్యాహ్న భోజనం చేస్తున్న వీడియో వైరల్ అయింది. ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం అమలులో పరిశుభ్రత లోపించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ధిమర్‌ఖేడా తహసీల్‌లోని కోఠి గ్రామంలోని సెహ్రా టోలాలో, శిథిలావస్థలో ఉన్న ప్రైవేట్ భవనంలో ఈ అంగన్‌వాడీ కేంద్రం నడుస్తోంది. పిల్లలు నేలపై కూర్చొని తినే ఆహారాన్ని మేకలు కూడా తినడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనపై విచారణకు ఆదేశించారు.

సంబంధిత పోస్ట్