
ఎంఎస్ ధోని బర్త్ డే.. బీసీసీఐ స్పెషల్ విషెస్!
భారత క్రికెట్ దిగ్గజం, కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోని నేడు తన 45వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. 538 అంతర్జాతీయ మ్యాచ్‌లు, 17,266 పరుగులు, 829 స్టంపింగ్‌లు, కెప్టెన్‌గా మూడు ఐసీసీ ట్రోఫీలు సాధించిన ధోని ప్రస్థానం అద్వితీయం. టికెట్ కలెక్టర్ స్థాయి నుంచి దేశానికి ట్రోఫీలు అందించే వరకు ఎదిగిన ఆయనకు బీసీసీఐ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపింది. ఎక్స్ వేదికగా 'క్రికెట్ ఐకాన్' అంటూ పోస్ట్ పెట్టింది.




