ఇకపై చిల్డ్రన్‌ బుకర్‌ ప్రైజ్‌ను గెలుచుకున్నవారికి రూ.58,45,215

24170చూసినవారు
ఇకపై చిల్డ్రన్‌ బుకర్‌ ప్రైజ్‌ను గెలుచుకున్నవారికి రూ.58,45,215
బుకర్ ప్రైజ్ ఇకపై పిల్లలకు కూడా అందించనుందని అక్టోబరు 24న బుకర్ ప్రైజ్ ఫౌండేషన్ ప్రకటించింది. ఈ కేటగిరీని 2026లో నామినేషన్ల కోసం తెరవనున్నారు. తద్వారా 2027లో విజేతకు బహుమతులు ఇవ్వనుంది. 8–12 ఏళ్ల పిల్లల కోసం రచించిన కాల్పనిక సాహిత్యానికి ఇది వర్తిస్తుంది. పుస్తకాలు ఇంగ్లాండ్‌ లేదా ఐర్లాండ్‌లో ప్రచురించబడాలి. గెలుచుకున్నవారికి 50,000 పౌండ్ల (సుమారు రూ.58,45,215) బహుమతి ఇవ్వనున్నారు.

సంబంధిత పోస్ట్