
యాచకుడిపై దాడి.. హత్య చేసిన మానవ మృగం
ఖమ్మం జిల్లా టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో భార్య, చిన్న పిల్లాడితో కలిసి యాచకుడిగా జీవనం సాగిస్తున్న రెహమాన్‌ను గుర్తుతెలియని వ్యక్తి అమానుషంగా దాడి చేసి హత్య చేశాడు. ఈ నెల 29న తెల్లవారుజామున బైక్‌పై వచ్చిన నిందితుడు రెహమాన్‌ను పదే పదే తన్నుతూ క్రూరంగా దాడి చేశాడు. బాధితుడు మృతి చెందిన తర్వాత కూడా దాడి కొనసాగించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో స్పష్టంగా కనిపించాయి. రెహమాన్ భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.




