
పెరగనున్న మొబైల్ రీఛార్జ్ ధరలు
మొబైల్ యూజర్లకు మరోసారి రీఛార్జ్ ధరల షాక్ తగలనుంది. రానున్న 3-6 నెలల్లో కంపెనీలు టారిఫ్లను పెంచే అవకాశం ఉందని యాక్సిస్ క్యాపిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గౌరవ్ మల్హోత్రా వెల్లడించారు. 10 శాతంలోపే టారిఫ్ ఛార్జీలు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికే నిత్యావసర సరుకులు, ఇంధన ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఇది మరింత భారం కానుందని విశ్లేషకులు చెబుతున్నారు.




