రాయ్‌పుర్‌లో టీమిండియాకు ఉత్సాహభరిత స్వాగతం లభించింది. రెండో వన్డే కోసం సోమవారం సాయంత్రం రాయ్‌పుర్‌కు చేరుకున్న విరాట్ కోహ్లీని చిన్నారులు హోటల్ వద్ద చుట్టుముట్టారు. అతన్ని చూసి ఆనందంతో ముగ్ధులైన పిల్లలు.. ఎర్ర గులాబీలు అందించి ఘనంగా ఆహ్వానించారు. కోహ్లీ కూడా నవ్వుతూ పూలను స్వీకరించి వారికి అభివాదం చేశాడు. ఈ స్పెషల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.