స్మార్ట్ ఫోన్‌లు, వీడియో గేమ్స్, టీవీలు వంటి ఎలక్ట్రానిక్ పరికరాల స్క్రీన్ టైమ్ పిల్లల హృదయ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 6-10 సంవత్సరాల పిల్లల్లో ప్రతి అదనపు గంట స్క్రీన్ టైమ్ గుండె వ్యాధి ప్రమాదాన్ని 0.08 ప్రమాణ విచలనం (standard deviation) వరకు పెంచుతుందని అధ్యయనం వెల్లడించింది. నిద్ర తగినంత లేని, ఎక్కువ సేపు ఫోన్‌లు చూసే పిల్లలలో గుండెపోటు ముప్పు మరింత ఎక్కువని నిపుణులు చెప్తున్నారు.