మిర్చి ఆకులు శరీర జీవక్రియను పెంచి, బరువు తగ్గడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉండటం వల్ల కంటి చూపు మెరుగుపడి, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రక్తపోటును నియంత్రించి, గుండె ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు చర్మ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. వీటిని పప్పు, వేపుళ్లు, సూప్‌లు, చట్నీల రూపంలో తీసుకోవచ్చు. అయితే, గర్భిణీలు, అల్సర్ బాధితులు వైద్యుల సలహాతో తక్కువ మోతాదులో వాడాలి.