
కొడుకు మరణాన్ని తట్టుకోలేక తల్లిదండ్రుల ఆత్మహత్య
కన్నకొడుకు మరణాన్ని తట్టుకోలేక దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని జంజ్‌గిర్ - చంపా జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాకు చెందిన కృష్ణ పటేల్, రమాబాయి పటేల్ దంపతుల కుమారుడు ఆదిత్య కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించాడు. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురైన దంపతులు ఫిబ్రవరి 16న తమ నివాసంలోని పెరట్లో చెట్టుకు ఉరివేసుకుని చనిపోయారు. 'కుమారుడు లేని జీవితం మాకు భారంగా ఉంది, ఆ బాధను భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నాం' అని సూసైడ్ లేఖలో పేర్కొన్నారు.




