చైనా మానవ సహిత అంతరిక్ష కేంద్రం (CMSA) ఒక కీలక ప్రకటన చేసింది. తమ దేశ వ్యోమగాములతో పాటు పాకిస్థాన్ వ్యోమగామిని అంతరిక్షంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలిపింది. దీనికి సంబంధించి పాకిస్థాన్‌కు చెందిన ఇద్దరు వ్యోమగాములకు శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొంది. వీరిలో ఒకరిని పెలోడ్ స్పెషలిస్ట్‌గా స్వల్పకాలిక అంతరిక్ష ప్రయాణ మిషన్‌లో పాల్గొనేందుకు ఎంపిక చేస్తామని CMSA ప్రతినిధి జాంగ్ జింగ్బో వెల్లడించారు.