హార్ముజ్‌ జలసంధిని తెరవాల్సిందే: ఇరాన్‌పై చైనా తీవ్ర ఒత్తిడి

94చూసినవారు
హార్ముజ్‌ జలసంధిని తెరవాల్సిందే: ఇరాన్‌పై చైనా తీవ్ర ఒత్తిడి
పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో హార్ముజ్‌ జలసంధి వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. హార్ముజ్ మార్గంలో 700కు పైగా చమురు ట్యాంకర్లు నిలిచిపోయినట్లు సమాచారం. దీంతో చమురు, గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడి ప్రపంచ మార్కెట్లలో ధరలు పెరుగుతున్నాయి. ఈ మేరకు హార్ముజ్‌ను తెరిచి ఉంచాలని చైనా, ఇరాన్‌పై తీవ్ర ఒత్తిడి తెస్తోందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ముఖ్యంగా ఖతార్ ఎల్‌ఎన్‌జీ ఎగుమతులపై ప్రభావం పడుతోందని, వెంటనే హార్ముజ్‌ను తెరవాలని చైనా పట్టుబట్టిందని సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్