పుతిన్ భారత పర్యటనపై చైనా కీలక వ్యాఖ్యలు

50చూసినవారు
పుతిన్ భారత పర్యటనపై చైనా కీలక వ్యాఖ్యలు
రెండు రోజుల పర్యటనలో భాగంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్‌లో పర్యటిస్తున్నారు. ప్రస్తుతం పుతిన్, ప్రధాని మోదీ మధ్య ద్వైపాక్షిక భేటీ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇరుదేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదరనున్నాయి. అయితే పుతిన్ భారత పర్యటనపై చైనా కీలక వ్యాఖ్యలు చేసింది. ఏ దేశం ఒంటరి కాదనే సందేశాన్ని పుతిన్ ప్రపంచానికి తెలియజేశారంటూ వ్యాఖ్యానించింది. రష్యా చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో భారత్‌పై పశ్చిమ దేశాలు ఒత్తిడి చేస్తున్నాయని పేర్కొంది.

సంబంధిత పోస్ట్