చైనా సముద్ర గర్భ పరిశోధన: అమెరికా, భారత్‌కు కలవరం

9431చూసినవారు
చైనా సముద్ర గర్భ పరిశోధన: అమెరికా, భారత్‌కు కలవరం
ఆధునిక యుద్ధ తంత్రంలో సముద్ర గర్భ మ్యాపింగ్ డేటా కీలకమని, చైనా నిర్మిస్తున్న భారీ మొబైల్ డీప్-సీ పరిశోధనా వేదిక అమెరికా, భారత్‌లను ఆందోళనకు గురిచేస్తోందని నిపుణులు భావిస్తున్నారు. 'డీప్-సీ ఆల్-వెదర్ రెసిడెంట్ ఫ్లోటింగ్ రీసెర్చ్ ఫెసిలిటీ' పేరుతో అభివృద్ధి చేస్తున్న తేలే ద్వీపం 78,000 మెట్రిక్ టన్నుల బరువుతో, 30 అంతస్తుల ఎత్తుతో ఉంటుంది. ఇది 10 వేల మీటర్ల లోతు వరకు సముద్ర గర్భాన్ని శోధించగలదు. చైనా దీనిని తుపానుల అంచనా, పర్యావరణ పరిశోధన, ఇంధన వనరుల అన్వేషణ కోసం అని చెబుతున్నా, దాని వెనుక ద్వంద్వ ప్రయోజనం ఉందని, జలాంతర్గాముల ప్రయాణ మార్గాలను సుగమం చేసుకోవాలని చూస్తోందని రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్