
భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు చిన్నారులు సహా 11 మంది మృతి
ఇండోనేషియాలోని తూర్పు ప్రాంతం పపువాలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సెంట్రల్ పపువా ప్రావిన్స్‌లోని పానియాయ్ పట్టణంలో చెలరేగిన మంటలు పలు దుకాణ సముదాయాలకు వ్యాపించాయి. ఈ దుర్ఘటనలో 11 మంది మృతి చెందగా, వారిలో ఆరుగురు చిన్నారులు ఉన్నారు. మంటలు 3 గంటలకు పైగా కొనసాగాయి, దాదాపు 40 దుకాణాలు, ఇళ్లు దగ్ధమయ్యాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.




