షక్స్‌గామ్ లోయ తమదేనని చైనా మళ్లీ ప్రకటించుకుంది. భారత్ అభ్యంతరం తెలపడంతో ఈ ప్రకటన చేసింది. లోయలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు అభ్యంతరాలకు తావులేకుండా నిర్మిస్తున్నవని చైనా తెలిపింది. అయితే షక్స్‌గామ్ లోయ భారత్‌లోనిదేనని 1963లో చైనా-పాకిస్తాన్ కుదుర్చుకున్న సరిహద్దు ఒప్పందాన్ని తాము గుర్తించలేదని, అది చట్టవిరుద్ధమని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణదీర్ జైశ్వాల్ తెలిపారు. బలవంతంగా ఆక్రమించుకున్న భారత భూభాగం మీదుగా వెళ్లే చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (సీపెక్)ను కూడా భారత్ గుర్తించడం లేదని ఆయన స్పష్టం చేశారు. దీనిపై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ స్పందిస్తూ, భారత్ పేర్కొన్న భూభాగం చైనాదేనని, చైనా తన భూభాగంలోనే మౌలిక వసతుల నిర్మాణాలను చేపట్టిందని తెలిపారు.