‘తీస్తా’ ప్రాజెక్టులో బంగ్లాదేశ్‌కు సహకరిస్తాం: చైనా

15644చూసినవారు
‘తీస్తా’ ప్రాజెక్టులో బంగ్లాదేశ్‌కు సహకరిస్తాం: చైనా
తీస్తా నది సమగ్ర నిర్వహణ, పునరుద్ధరణ ప్రాజెక్టుపై భారత్ వ్యక్తం చేసిన ఆందోళనలకు చైనా స్పందించింది. బంగ్లాదేశ్‌కు తన సహకారాన్ని పునరుద్ఘాటిస్తూ, ఈ విషయంలో మూడో పక్షం ప్రభావం తమపై ఉండదని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి గువో జియాకున్‌ తెలిపారు. తీస్తాను బంగ్లాదేశ్‌కు జీవనోపాధి ప్రాజెక్టుగా పేర్కొంటూ, దీనికి మద్దతుగా తన వంతు సాయం చేయడానికి చైనా ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్