చైనా-అమెరికా రాజీ.. 100% టారిఫ్ ముప్పు లేనట్టే!

115చూసినవారు
చైనా-అమెరికా రాజీ.. 100% టారిఫ్ ముప్పు లేనట్టే!
మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో జరిగిన రెండు రోజుల చర్చల అనంతరం చైనా, అమెరికా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి. ఇరు దేశాల మధ్య కొత్త వాణిజ్య ఒప్పందంపై ప్రాథమిక ఏకాభిప్రాయం కుదిరింది. అమెరికా విధించాలనుకున్న 100% టారిఫ్ ముప్పు తొలగిపోయింది. చైనా మంత్రి లిఫెంగ్ మాట్లాడుతూ, 'ఈ 100% టారిఫ్ ముప్పు పూర్తిగా తొలగింది. మా మధ్య జరిగిన చర్చలు బహిరంగమైనవి, లోతైనవి, వ్యూహాత్మకమైనవి' అని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా చైనాతో ఒప్పందం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్