ఏడాదిలోపే చైనా కెనడాను తినేస్తుంది: ట్రంప్ హెచ్చరిక

26చూసినవారు
ఏడాదిలోపే చైనా కెనడాను తినేస్తుంది: ట్రంప్ హెచ్చరిక
కెనడా ‘గోల్డెన్‌ డోమ్‌’ రక్షణ వ్యవస్థను తిరస్కరించడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్ర విమర్శలు గుప్పించారు. చైనాతో వ్యాపారానికి ప్రాధాన్యం ఇస్తున్న కెనడా నిర్ణయాన్ని తప్పుబడుతూ, ఏడాదిలోపే చైనా వారిని నాశనం చేస్తుందని ట్రూత్‌ సోషల్‌లో హెచ్చరించారు. ఇటీవల కెనడా ప్రధాని మార్క్‌ కార్నీ గ్రీన్‌లాండ్‌ సుంకాలను వ్యతిరేకించడంతో ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే చైనాతో కొత్త వాణిజ్య ఒప్పందం కెనడియన్‌ కార్మికులకు లాభం చేకూరుస్తుందని కార్నీ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్