భారత భూభాగమైన అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా దురాక్రమణ వాదనలు కొనసాగుతుండగా, ఈ నెల 21న లండన్ నుండి జపాన్‌కు వెళ్తున్న అరుణాచల్ మహిళా పెమా వాంగ్ థాంగ్ డోక్‌ను షాంఘై విమానాశ్రయంలో చైనా అధికారులు 18 గంటల పాటు నిర్బంధించి, వేధింపులకు పాల్పడ్డారు. అరుణాచల్ చైనా భూభాగమని, భారతీయ పాస్‌పోర్ట్ చెల్లదని చెప్పి, ఆమెను అవమానించారు. భారతీయ అధికారుల జోక్యంతో ఆమె విడుదలయ్యారు. ఈ ఘటనను ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేస్తూ, దేశ సార్వభౌమాధికారానికి అవమానమని ఆమె అభివర్ణించారు.