చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సెప్టెంబర్‌లో ఢిల్లీలో జరిగే బ్రిక్స్ సదస్సుకు హాజరయ్యే అవకాశమున్నట్లు దౌత్య వర్గాలు తెలిపాయి. ఈ పర్యటన ఖరారైతే, 2020లో గల్వాన్ ఘర్షణ అనంతరం జిన్‌పింగ్ భారత్‌కు రావడమిదే తొలిసారి కానుంది. చివరిసారిగా 2019 అక్టోబర్‌లో ఆయన భారత్‌లో పర్యటించారు. సరిహద్దు వివాదాల పరిష్కారానికి ఇరు దేశాల మధ్య దౌత్య చర్చలు వేగం పుంజుకునే అవకాశం ఉంది. అయితే జిన్‌పింగ్ పర్యటనపై
భారత్, చైనా ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.